పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనంలో చేస్తుండగా విషాదం జరిగింది. పడవ మునిగి ఐదుగురు మరణించారు. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనంలో చేయడానికి భక్తులు రెండు పడవల్లో వెళ్లారు. అందులో ఓ పడవ మునిగిపోవడంతో ఐదుగురు మృతి చెందారు.
ఈ ఘటన ముర్షీదాబాద్‌లోని డుమ్నీ చెరువులో సోమవారం సాయంత్రం జరిగింది. మృతులు బెల్డంగా ప్రాంతానికి చెందిన వారని అధికారులు గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో చెరువును గాలిస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే విపత్తు నిర్వహణ బృందం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయని పేర్కొన్నారు.