లాకప్‌లో గ్యాంగ్‌రేప్.. ఐదుగురు పోలీసులు 10 రోజులపాటు  - MicTv.in - Telugu News
mictv telugu

లాకప్‌లో గ్యాంగ్‌రేప్.. ఐదుగురు పోలీసులు 10 రోజులపాటు 

October 19, 2020

vnvnfgn

కంచే చేనును మోసిన సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అన్ని వేళలా మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులులే ఓ మహిళను సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలోని రేవా జిల్లా మాంగ్‌వాన్‌‌లో జరిగింది. కొన్ని రోజుల క్రితం ఓ హత్య కేసులో 20 ఏళ్ల యువతి అరెస్ట్ అయింది. పోలీసులు ఆమెను లాకప్‌లో ఉంచారు.‌ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. 

కానీ, స్టేషన్‌ ఇన్‌చార్జ్‌తో సహా ఐదుగురు పోలీసులు ఆమెను అత్యాచారం చేయడం మొదలెట్టారు. పది రోజుల పాటు ఐదుగురు ఆమెపై అత్యాచారం చేశారు. అక్టోబర్‌ 10న అడిషనల్‌ జిల్లా జడ్జితో పాటు కొందరు లాయర్లు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లగా ఈ విషయం బయటపడింది. తనపై గత పది రోజులుగా ఐదుగురు పోలీసులు అత్యాచారం చేసినట్టు ఆమె వివరించింది. ఈ విషయం తెలిసిన రేవా జిల్లా ఎస్పీ రాకేష్ సింగ్ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.