5 Things People Should Avoid Searching On Google
mictv telugu

గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తే జైలు జీవితం ఖాయం

January 2, 2023

5 Things People Should Avoid Searching On Google

ఏదైనా సమాచారం కావాలనుకుంటే వెంటనే అందరికీ గుర్తొచ్చే పేరు గూగుల్. ఇందులో ప్రపంచంలోని ప్రతీ విషయం గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. కానీ, కొన్ని విషయాల గురించి సెర్చ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. ఆ కొన్ని విషయాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1. అబార్షన్ : దీని కోసం గూగుల్ లో వెతకొద్దు. అబార్షన్ అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. అంతేకానీ, గూగుల్ లో అబార్షన్ ఎలా చేసుకోవాలని వెతికితే జైలు శిక్ష పడుతుంది.
2. చైల్డ్ పోర్న్ : మైనర్, చిన్నారుల అశ్లీత చిత్రాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. వీరి కోసమే ప్రత్యేకంగా తెచ్చిన పోక్సో చట్టం ప్రకారం చైల్డ్ పోర్న్ గురించి గూగుల్ లో వెతికితే ఐదు నుంచి ఏడు సంవత్సరాల శిక్ష విధించబడుతుంది.
3. బాంబు తయారీ విధానం : దీని కోసం సెర్చ్ చేస్తే ఐపీ చిరునామా ద్వారా పోలీసులు ట్రాకింగ్ చేసి చర్యలు తీసుకుంటారు. జైలు శిక్ష కూడా పడుతుంది.
4. ఇతరుల ప్రైవేట్ సమాచారం : లైంగిక వేధింపులు లేదా వేధింపుల బాధితుల గురించి ప్రైవేట్ సమాచారం పంచుకోవడం చట్టరీత్యా నేరం. బాధిత మహిళల ఫోటో, పేరు, ఇతర వివరాలు సెర్చ్ చేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు.
5. : సినిమా పైరసీ : సినిమాలను పైరసీ చేసినా, గూగుల్ లో సెర్చ్ చేసినా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. శిక్షతో పాటు పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు. పైవాటితో పాటు దేశ భద్రత, రక్షణ వంటి సున్నిత అంశాలపై సెర్చ్ చేయకపోవడం ఉత్తమం

ఇవి కూడా చదవండి : 

యూట్యూబ్ వీడియోస్‌తో రూ.40 లక్షల అప్పు తీర్చేశాడు

రేవంత్ రెడ్డి అరెస్ట్.. బొల్లారం పీఎస్‌కు తరలింపు

ఈ వార్త చదివితే.. ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేయరు..

బీజేపీని దెబ్బ కొట్టింది నినే.. కేసీఆర్ కాదు ED , CBI ఎవనికి భయపడేది లేదు.. ఎమ్మెల్యే కొనుగోలు పై పైలట్ రోహిత్ రెడ్డి