ఉల్లి కష్టాలు..5 టన్నుల ఉల్లి.. 4 గంటల్లో ఖాళీ - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి కష్టాలు..5 టన్నుల ఉల్లి.. 4 గంటల్లో ఖాళీ

December 8, 2019

onion02

దేశవ్యాప్తంగా ఉల్లి కష్టాలు తీవ్రమవుతున్నాయి. రోజు రోజుకి ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.150కి లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సబ్సిడీ కింద కిలో ఉల్లిని రూ.25కే అమ్మాలని నిర్ణయించింది. తిరుపతి ఆర్‌సీ రోడ్డు రైతు బజారులో సబ్సిడీ ధరకు ఉల్లిని అమ్ముతున్నారు. దీంతో ప్రజలు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఉదయం నుంచే అన్నమయ్య సర్కిల్‌ నుంచి రైల్వేగేటు వరకు బారులు తీరారు.

రైతుబజార్‌లో ఆదివారం ఉదయం మార్కెటింగ్‌ శాఖ ఐదు టన్నుల ఉల్లిగడ్డలను అమ్మకానికి పెట్టింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అమ్మకాలు.. కేవలం నాలుగు గంటల్లోనే ముగిశాయి. తిరుపతి ప్రజలు మాత్రమే కాకుండా చంద్రగిరి, రామాపురం, ఏర్పేడు, కరకంబాడి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అవసరమైనంత ఉల్లి అందుబాటులో లేకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.