బాలీవుడ్ కి చెందిన కొరియోగ్రాఫర్, ప్రముఖ లేడీ డైరెక్టర్ ఫరాఖాన్ పుట్టిన రోజు నేడు. మరి ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
ఫరాను.. కేవలం ఫిల్మ్ మేకర్ అనలేం. ఆమె ఒక కొరియోగ్రాఫర్, నటి, న్యాయనిర్ణేత అన్నింటికంటే ఒక మనసున్న మంచి వ్యక్తి. బాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత 92లో ‘జో జీతా వహీ సికిందర్’లో పెహలా నషా పాటతో కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంది. చల్ చయ్యాచయ్యా అంటూ మరింత ప్రజాదరణ పొందింది. ఆమె గురించి 5 నిజాలు మీకు చెప్పబోతున్నాం.
1. ఫరా, ఆమె భర్త శిరీష్ కుందర్ ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వారు ప్రారంభించిన కంపెనీకి ముగ్గురు పిల్లల పేర్లు కలిసి వచ్చేలా ‘త్రీస్ కంపెనీ’ అని పేరు పెట్టారు. వారి పిల్లల పేర్లు కొడుకు జార్, కుమార్తెలు దివా, అన్య.
2. కొందరికీ కొన్ని చూస్తే భయం వేస్తుంది. అలాగే ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఫరా ఇంజెక్షన్లను చూస్తే భయపడుతుందట. అందుకే తనకు ఏం జరిగినా కూడా డాక్టర్లను ఇంజక్షన్ ఇవ్వకూడదని అభ్యర్థిస్తుంది.
3. ‘షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పడి’ చిత్రంతో ఫరా సినిమా రంగంలోకి ప్రవేశించిందని అందరూ అనుకుంటారు. ఇందులో బోమన్ ఇరానీ తో జత కట్టి సినిమాని వేరే లెవల్ కి తీసుకుపోయింది. కానీ ఈమెకు ఇది మొదటి సినిమా కాదు. షారూఖ్ కాజోల్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’లో కాజోల్ ని ఎగతాళి చేసే అమ్మాయి పాత్రలో మనీష్ మల్హోత్రాతో కనిపించింది.
4. బాలీవ్ ప్రముఖులతో పాటు.. హాలీవుడ్ స్టార్ కైలీ మినోగ్ ని ‘బ్లూ’ చిత్రంలో ‘చిగ్గీ విగ్గీ’ అనే ట్రాక్ లో తన ట్యూన్స్ కి డ్యాన్స్ చేసిన ఘనత ఫరాకి దక్కుతుంది. అంతేకాదు.. న్యూయార్క్ రేడియో సిటీలో జరిగిన ఎంటీవీ అవార్డుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్ సింగర్ షకీరాకు నృత్య దర్శకత్వం వహించింది.
5. ఫరాఖాన్ మొదటి కజిన్ ఫర్హాన్ అక్తర్ అని మీకు తెలుసా! అయితే ఈ ఇద్దరు పుట్టిన రోజులు కూడా ఈ రోజే! ఇలా తమ పుట్టినరోజును పంచుకుంటున్నారు.