5 ways to Get rid of dandruff and its home remedies
mictv telugu

చుండ్రు.. దురద బాధిస్తున్నదా?

November 22, 2022

5 ways to Get rid of dandruff and its home remedies

చుండ్రు ఇప్పుడు అందరినీ బాధించే అతి పెద్ద సమస్య. చలికాలంలో మరింత పెరిగే దీన్ని నివారించడానికి మన ఇంట్లోనే చిట్కా వైద్యాలు పాటించొచ్చు.జుట్టు పోషణ కోసం నూనె, షాంపూలు, కండీషనర్.. ఇలా బోలెడు ఉన్నాయి. ఇలా ఎన్ని వాడినా కూడా చుండ్రు సమస్య అందరినీ బాధించేస్తుంది. దీనికి తోడు దురద కూడా నిద్ర పట్టనివ్వదు. ఒత్తిడి, పొడి చర్మం, సరిగా దువ్వకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. మరి నివారణ మార్గాలపై ఓ లుక్కేయండి.

5 ways to Get rid of dandruff and its home remedies

హెన్నా.. మిన్న

మెహందీ, గోరింటాకు.. ఇప్పుడు పొడి రూపంలో వస్తుంది. దీన్నే హెన్నా అని పిలుస్తున్నారు. ఈ హెన్నాజుట్టుకు బలాన్ని, రంగు.. మెరుపును సంతరించుకొనేలా చేస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందేంటంటే.. హెన్నాలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని 8గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టుకు రాసి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరుచుగా చేస్తే చుండ్రు సమస్య చాలావరకు తగ్గించొచ్చు.

5 ways to Get rid of dandruff and its home remedies

కొబ్బరినూనె_ నిమ్మరసం

రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరినూనెని వేడి చేయాలి. దీంట్లో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం పోసి బాగా కలుపాలి. ఈ మిశ్రమం కుదుళ్లకు అంటేలా జుట్టు అంతా రాయాలి. 20 నిమిషాల పాటు ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. నూనె జుట్టుకు బలాన్నిఇస్తుంది. దీనికి నిమ్మరసం జత కావడంతో ఇది చుండ్రు నివారణకు మంచి మందులా పనిచేస్తుంది.

5 ways to Get rid of dandruff and its home remedies

మెంతితో కాంతి

మెంతులు ఒంట్లోని అధిక కొవ్వును కంట్రోల్ చేస్తాయి. అంతటి గొప్ప ఔషధ గుణాలున్న మెంతులు చుండ్రు సమస్యను కూడా ఇట్టే తీసేస్తుంది. రాత్రి ఒక గిన్నెలో మెంతులను వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. ఉదయం లేచాక దీంట్లో నిమ్మరసం పోసి మిక్సీ పట్టాలి. అప్పుడు ఇది గట్టి పేస్ట్లా తయారవుతుంది. దీన్ని జుట్టు మొత్తం రాయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5 ways to Get rid of dandruff and its home remedies

 

పెరుగుతో పరుగు

అన్నిటికంటే సులభమైన చిట్కా. దీంతో కచ్చింతగా పెరుగుతో చుండ్రు సమస్య ఇట్టే నివారణ అవుతుంది. గట్టి పెరుగు తీసుకొని జుట్టు అంతా రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. అయితే పెరుగు అంతా పోయేలా మంచిగా తలస్నానం చేయాల్సి ఉంటుంది. పెరుగు జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది.

గుడ్డు.. వెరీగుడ్

గుడ్డులోని పచ్చసొన జుట్టుకు కావాల్సిన న్యూట్రియంట్స్ అందిస్తుంది. జుట్టులోని పచ్చసొన మాత్రం తీసుకొని జుట్టు మొత్తం రాయాలి. ఇలా రాశాక ప్లాస్టిక్ కవర్ లేదా తలకు పెట్టుకునే కవర్లను తొడగాలి. గంట సేపు అలాగే ఉంచాలి. తలస్నానం కూడా కొద్దికొద్దిగా రుద్దుతూ చేయాల్సి ఉంటుంది. వాసన పోవడానికి రెండు, మూడుసార్లు తల రుద్దుకోవాలి. అయితే ఈ చిట్కా చుండ్రు నివారణకు మాత్రం బాగా పనికొస్తుంది.

5 ways to Get rid of dandruff and its home remedies