ఐదేళ్ల వయుస్సులోనే ఓ బాలుడు కానిస్టేబుల్‌గా నియామకమయ్యాడు. స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా ఆ చిన్నారిని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు అతడికి నియమాక పత్రాలను అందించారు.
పూర్తి వివరాల్లోకి వెలితే.. ఛత్తీస్‌గఢ్ సూరజ్‌పుర్ జిల్లాకి చెందిన హరి ప్రసాద్ ఓ సబ్ ఇన్ స్పెక్టర్. కొరియా జిల్లాలో ఆయన విధులు నిర్వహించేవాడు. కొద్ది రోజులు కిందట డ్యూటీ సమయంలో ప్రాణాలు విడిచాడు. దీంతో తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద కుటుంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సుర్గుజా రేంజ్ ఐజీ రామ్‌గోపాల్ గార్గ్ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఐజీ ఆదేశాల మేరకు సూరజ్‌పుర్ ఎస్పీ రామకృష్ణ సాహు రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి బాలుడికి కానిస్టేబుల్‌గా ఉద్యోగం అవకాశం కల్పించారు. తల్లి సమక్షంలో నియామకపత్రాలతో పాటు చాక్లెట్లను అందించారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పూర్తిస్థాయి కానిస్టేబుల్‌గా అతడు నియామకం కానున్నాడు.