యూపీలో మరో ‘ఘోర’క్ పూర్ - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో మరో ‘ఘోర’క్ పూర్

September 4, 2017

గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో కన్ను మూసిన పిల్లల తల్లుల గర్భశోకం తీరకముందే అదే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఫరఖ్కాబాద్ లోని రాం మనోహర్ లోహియా ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ అందక గత నెల రోజుల్లో 50 మంది చిన్నారులు అసువులు బాశారు. వీరందరూ.. అప్పుడే పుట్టిన పసికందులు. మందులు, ఆక్సిజన్ కొరతతోపాటు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు చనిపోయారని బాధిత తల్లిందండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోరఖ్ పూర్ ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ అందక వంద మంది చిన్నారులు మృత్యువాత పడటం తెలిసిందే. తర్వాత జార్ఖండ్‌ లోని  ఎంజీఎం ఆస్పత్రిలో 52 మంది చిన్నారులు  చనిపోయారు. సరైన ఆహారం అందివ్వకపోవడం వల్లే వీరు చనిపోయారని భావిస్తున్నారు.