50 కోట్ల మొబైల్ ఫోన్లు డిస్‌కనెక్ట్.. ప్రభుత్వ వివరణ - MicTv.in - Telugu News
mictv telugu

50 కోట్ల మొబైల్ ఫోన్లు డిస్‌కనెక్ట్.. ప్రభుత్వ వివరణ

October 18, 2018

ఆధార్ కార్డు వర్సెస్ మొబైల్ ఫోన్ల నంబర్లు  అన్నట్టు సాగుతోంది యుద్ధం. ప్రైవేటు కంపెనీలు ఆధార్ నంబర్ తీసుకోవడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పివ్వడంతో ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఇప్పటికే ఆధార్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌లలో చేరడంతో ఈ సమస్య మొదలైంది. కోర్టు తీర్పు వల్ల దేశంలో 50 కోట్ల మొబైల్‌ నంబర్లు డిస్‌కనెక్ట్ అవుతున్నట్టు  కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది.

ytytyy

దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ‘ఆధార్‌ డాక్యుమెంట్లతో జారీ చేసిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లను డిస్‌కనెక్ట్ చేసే ప్రసక్తే లేదు. అలాంటి వార్తలను నమ్మకండి. దీనిపై మేం ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నాం.. కొత్త సిమ్ కార్డులను మాత్రమే ఆధార్ డాక్యుమెంట్లతో తీసుకోవద్దు.. పాత నంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డీయాక్టివేట్ చేయం ’ అని ఆధార్లను జారీచేసే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌(డాట్‌)లు ఓ ప్రకటనలో తెలిపాయి. కోర్టు తీర్పుతో ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నాయి. తీర్పు ప్రకారం.. పాత ఆధార్‌ ఈకేవైసీ బదులు తాజా కేవైసీతో మొబైల్‌ నంబర్‌ తీసుకోవాలంటే మొదట ఆధార్‌ను డీలింక్‌ చేసుకోవాలి. అధికారిక చెల్లుబాటు ధ్రువపత్రాన్ని(ఓవీడీ) అందించి, మొబైల్‌ నంబర్‌ను పొందాలి.