50 inches smart TV for Rs. 15 thousand..amazing features
mictv telugu

రూ.15 వేలకే 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ..అదిరిపోయే ఫీచర్లు

August 11, 2022

50 inches smart TV for Rs. 15 thousand..amazing features

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ స్మార్ట్ టీవీ ప్రియులకు శుభవార్తను చెప్పింది. తాజాగా తమ కంపెనీ నుంచి తయారు చేసిన 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి విడుదల చేశామని ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ ప్రతి సామాన్యుడు కొనుగోలు చేసేలా తక్కువ ధరకే విక్రయిస్తున్నామని తెలిపింది. ఈ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీలో ఉన్న ఫీచర్లు, ధర, డిస్కౌంట్, వంటి తదితర పూర్తి వివరాలను వెల్లడించింది.

”ఒప్పో కంపెనీ నుంచి తాజాగా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి విడుదలైంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ చైనాలో అందుబాటులో ఉంది. దీని ధర 1399 యువాన్ ( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 16,500) నిర్ణయించాం. ఇందులోనూ డిస్కౌంట్‌ కూడా ఉంది. లాంచ్ ఆఫర్ కింద 1299 యువాన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 15,350) అందుబాటులోకి ఉంచాం. ప్రస్తుతం ఈ టీవిని కొనాలని అనుకున్నవారు ఒప్పో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయండి” అని యాజమాన్యం పేర్కొంది.

ఇక, ఫీచర్ల విషయానికొస్తే.. ”పేరు ఒప్పో K9x 50 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ. AI PQ అల్గారిథమ్‌. ఈ స్మార్ట్ టీవీ గరిష్ట బ్రైట్ నెస్ 280 నిట్‌లు. ఇందులో 2GB RAM, 16GB ROMఉంటుంది. క్వాడ్-కోర్ MediaTek చిప్‌సెట్, 20W పవర్ రేటింగ్‌తో రెండు ఇంటిగ్రేటెడ్ స్పీకర్‌లు ఉన్నాయి. మూడు HDMI పోర్ట్‌లు, ఒక ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి. దీనితోపాటు వైర్‌లెస్ కనెక్షన్ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి మద్దతుగా ఉంటుంది. ​​ ఎల్‌ఈడీ-బ్యాక్‌లిట్ ప్యానెల్‌తో 50 అంగుళాల స్క్రీన్‌, పూర్తి 4K రిజల్యూషన్‌తో అదిరిపోయే లుక్‌‌ ఉంటుంది.”