50 students sick in Kakinada Kendriya Vidyalaya
mictv telugu

కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో 50 మందికి అస్వస్థత

September 6, 2022

ఏపీలోని కాకినాడ రూరల్ మండల పరిధి వలసపాకలలోని కేంద్రీయ విద్యాలయంలో 50 విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఘాటైన వాసన రావడంతో ఐదు, ఆరు తరగతులు చదువుతున్న 50 మంది విద్యార్ధులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. దీంతో స్పందించిన తోటి విద్యార్ధులు వారిని పాఠశాల బయటకు తెచ్చి సపర్యలు చేయగా, కుదరకపోవడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఘాటైన వాసనే కారణమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి అదుపులోనే ఉందని సూపరింటెండెంట్ బుద్ధ తెలిపారు. ఈ విద్యాలయం సమీపంలో కొన్ని రసాయనిక కంపెనీలు ఉండడంతో అక్కడి నుంచి విష వాయువులు ఏమైనా లీక్ అయ్యాయా అనే కోణంలో విచారిస్తున్నారు. అటు కొందరు విద్యార్ధులు మాత్రం తమకెలాంటి ఘాటైన వాసన రాలేదని చెప్తున్నారు. దీంతో ఎలా జరిగిందో తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, సోమవారం ఓ విద్యార్ధి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారని, ఈ సందర్భంగానే రసాయన స్ప్రేలు వినియోగించారని తెలుస్తోంది. మరి ఏది నిజమో విచారణలో తేలుతుంది.