డీసీపీని పరిగెట్టిస్తూ..500 మంది కానిస్టేబుళ్ల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

డీసీపీని పరిగెట్టిస్తూ..500 మంది కానిస్టేబుళ్ల దాడి

May 21, 2020

bgvrv

డీసీపీని కాస్టేబుళ్లు కొట్టడమేంటని అనుకుంటున్నారా..? అవును ఇది నిజంగానే జరిగింది. పశ్చిమబెంగాల్‌లో ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిని తర్వాత చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ పోలీసు ఉన్నతాధికారి పరిగెత్తి వారి బారి నుంచి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. సినిమాను తలపించేలా సాగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సీఎం మమతా బెనర్జీ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. అయితే కానిస్టేబుళ్లు తిరగబడటానికి ఓ బలమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. 

ఉమ్ పున్ తుఫాను కారణంగా సహాయక చర్యల కోసం 500 మంది కానిస్టేబుళ్లకు అధికారులు విధులు అప్పగించారు. ఈ క్రమంలో వారందరికి కేటాయించిన బ్యారక్‌లో ఉన్న ఓ ఎస్సైకి ఇటీవల కరోనా సోకింది. దీంతో వారి బ్యారక్ శానిటైజ్ చేయాలని కానిస్టేబుళ్లు కోరారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ పాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఆయన నిర్లక్ష్యపు సమాధానం విన్న వారంతా కోపం ఆపుకోలేకపోయారు. వెంటనే 500 మంది మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది అతన్ని జాగ్రత్తగా మరో ప్రాంతానికి తరలించారు. అయితే డీసీపీని ఇలా తోటి సిబ్బంది పరిగెత్తిస్తూ.. దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.