పెరిగిన జీతాలతో కొత్తగా 50 వేల ఉద్యోగాలు : ఇన్ఫోసిస్ - MicTv.in - Telugu News
mictv telugu

పెరిగిన జీతాలతో కొత్తగా 50 వేల ఉద్యోగాలు : ఇన్ఫోసిస్

April 13, 2022

infous

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఈ ఏడాది 50వేల నూతన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. గతేడాది 85 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నామని వెల్లడించింది. అంతేకాక, గత సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధితో రూ. 5,686 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది. కంపెనీ ఆదాయం 22 శాతం పెరిగింది. ఈ సందర్భంగా ఒక్కో షేరుకు రూ. 16 చొప్పున డివిడెంట్ ప్రకటించింది. అంతేకాక, ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు జీతాలు పెంచుతామని తీపి కబురు చెప్పింది. మరోవైపు రష్యా నుంచి కంపెనీ కార్యకలాపాలను తరలిస్తున్నట్టు ప్రకటించింది.