51 thousand cash prize for those who eat 8 kg samosa
mictv telugu

సమోసా పందెం.. తినే దమ్ముంటే 51 వేలు మీ సొంతం

July 8, 2022

51 thousand cash prize for those who eat 8 kg samosa

సమోసాలు తయారు చేసి విక్రయించే ఓ వ్యాపారి దాని మీదే ఓ పందెం విసిరాడు. తాను తయారు చేసిన బాహుబలి సమోసాను అరగంటలో తినగలిగితే ఏకంగా రూ. 51 వేలు ఇస్తానని పందెం కాస్తున్నాడు. కానీ, అందులోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. పూర్తి వివరాలు.. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో కౌశల్ అనే వ్యక్తి స్వీట్ షాపు నిర్వహిస్తుంటాడు.

సమోసాలు తయారు చేయడంలో ప్రావీణ్యం ఉన్న కౌశల్.. గతంలో నాలుగు కేజీల సమోసాను విజయవంతంగా రూపొందించాడు. ఇప్పుడు 8 కిలోల సమోసాను తయారుచేసి దానిని తినగలిగిన వారికి నగదు బహుమతి ఇస్తానంటూ ప్రకటన జారీ చేశాడు. సమోసాలో నాణ్యమైన బంగాళా దుంపలు, డ్రైఫ్రూట్స్, బఠాణీలు వినియోగించాడు. ఈ బాహుబలి సమోసాను తయారు చేయడానికి సుమారు గంటన్నర సమయం పడుతుంది. ఇంత భారీ సమోసాను రూపొందించి నగదు బహుమతి ప్రకటించిన కౌశల్ ఆఫర్ ఇప్పుడు ఆ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆఫర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ అంత పెద్ద సమోసాను తినే సాహసం చేయలేదు. కాగా, తొందర్లోనే 10 కేజీల సమోసాను తయారు చేసే ఆలోచనలో ఉన్నట్టు కౌశల్ వెల్లడించాడు.