అతనికి 51..ఆమెకు 18 

ప్రముఖ నటుడు, భారత మాజీ సూపర్ టాప్ మోడల్ మిలింద్ సోమన్(51), ఓ 18 ఏళ్ల అమ్మాయితో సహజీవనం చేయడం సంచలనం రేపుతోంది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న అంకిత కొన్వార్‌తో మిలింద్‌కు పరిచయం ఏర్పడింది. మొదట చూపులు కలిశాయి.. ఆ తర్వాత మాటలు కలిసాయి, అంతే  ప్రేమకు వయసుతో సంబంధంలేదు అని ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు.

అంతేకాదు ఇద్దరు ప్రేమ పక్షుల్లా విహరిస్తూ, ఆఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ ఫోటోలు చూసిన వారంతా, వీళ్లు తండ్రీ కూతురు కావచ్చు అని మొదట భ్రమ పడుతున్నారు.. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. మిలింద్ 2006 జులైలో ఫ్రెంచ్ నటి మిలెన్ జంపనోని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2009 లో మిలింద్, మిలెన్‌లు విడిపోయారు. మళ్లీ 18 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ అంకితతో మిలింద్ సహజీవనం చేస్తుండటం బాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.

SHARE