దేశంలో 5, 164 చేరిన కరోనా మరణాలు - Telugu News - Mic tv
mictv telugu

దేశంలో 5, 164 చేరిన కరోనా మరణాలు

May 31, 2020

 

lbr

భారత్ లో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకి కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,380 కరోనా పాజిటివ్ కేసులు మృతిచెందగా… 193 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,82,143కి చేరింది. 

అలాగే దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్యా 5,164 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో దేశంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 86,983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 89,995 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి.