తెలంగాణలో నేడు 52 కేసులు.. ఒకరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో నేడు 52 కేసులు.. ఒకరు మృతి

May 23, 2020

52 Positive Cases.

తెలంగాణలో నేడు కరోనా పాజిటివ్ కేసులు 52 నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు నమోదవగా, వలస కార్మికుల్లో 19 మందికి కరోనా సోకినట్టు వెల్లడించింది. కరోనాతో ఒకరు మృతిచెందగా మృతుల సంఖ్య 49కి చేరింది. ఈరోజు కరోనా నుంచి కోలుకుని 25 మంది డిశ్చార్జ్ అవగా, 696 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,813కు చేరుకుంది. డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,068కి చేరింది. కాగా, లాక్‌డౌన్ 4.0 అమలులో ఉండగా కేసులు పెరగడం అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలు అధైర్యపడవద్దని.. కరోనాతో పోరాటంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  తెలంగాణ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. కాగా, నేడు కూకట్ పల్లిలో కొత్తగా 2 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. రెండురోజుల క్రితం కరోనాతో చనిపోయిన వృద్ధుని డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. రెయిన్ బో విస్టా అపార్ట్‌మెంట్‌లోని అపోలో డాక్టర్ అనురూప్ ఇంట్లో మరో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. వీటితో కలుపుకుని తెలంగాణలో 52 కేసులు నమోదయ్యాయి.