కడుపుకోతలో తల్లడిల్లిన తల్లికి సంబరం.. 52 ఏళ్ల వయసులో కవలలు - MicTv.in - Telugu News
mictv telugu

కడుపుకోతలో తల్లడిల్లిన తల్లికి సంబరం.. 52 ఏళ్ల వయసులో కవలలు

October 12, 2019

52 years old women give birth to twins

అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఆ పిలుపులో మాధుర్యం కోసం ఎంతో పరితపిస్తుంటారు. ఇటీవల గుంటూరులోని ఓ ఆస్పత్రిలో 74 ఏళ్ల మంగాయమ్మ అనే బామ్మ ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడం ఇందుకు నిదర్శనం. 

తాజాగా భద్రాచలానికి చెందిన 52 ఏళ్ల మహిళ పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చింది.  కరీంనగర్‌లోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలో రమాదేవి(52) అనే మహిళకు కవలలు పుట్టారు. రమాదేవికి పెళ్ళైన కొత్తలో ఓ కొడుకు జన్మించాడు. కొడుకు చేతికొచ్చాడని తల్లిదండ్రులు సంతోషిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో అతడు మృతిచెందాడు. దీంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ సంతానం కావాలనుకున్నారు. వయసు మీద పడడంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతికారు. కరీంనగర్‌లోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రం గురించి తెలుసుకొని, డాక్టర్ పద్మజను సంప్రదించారు. డాక్టర్ పద్మజ ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఆమె గర్భం దాల్చేలా చేశారు. నెలలు నిండిన తర్వాత రమాదేవి ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.