53-year-old scales Mt Aconcagua country’s oldest woman to achieve feat
mictv telugu

53యేండ్ల వయసులో మంచు పర్వతాన్ని ఎక్కింది!

January 9, 2023


భోపాల్ కు చెందిన 53 యేళ్ల జ్యోతి రాత్రే అనే మహిళ దక్షిణ అమెరికాలోని 22,831 అడుగుల మంచుతో కప్పబడిన అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది. ఇది ఆ ఖండంలోని ఎత్తయిన శిఖరం.

జనవరి 3న పర్వతం పై భారత జెండాను ఎగురవేసినందున ఆమె ఈ ఘనత సాధించిన దేశంలోనే అత్యంత వృద్ధ మహిళగా అవతరించింది. అకాన్కాగువా పర్వతాన్ని స్కేల్ చేయడానికి ముందు అర్జెంటీనా, చిలీ మధ్య ఉన్నబెర్మెజో పర్వతాన్ని రాత్రే ఎక్కింది.

48 సంవత్సరాల వయసు వచ్చాక పదవీ విరమణ గురించి ఆలోచిస్తుంటారు. అయితే ఆ వయసులోనే తన పర్వోతారోహణని ప్రారంభించింది. ‘మేం గరిష్ఠ స్థాయికి చేరుకొనేటప్పుడు ఇది -20 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది’ అని జ్యోతి చెప్పింది. ‘అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించడానికి ఒక సాహస యాత్ర చేశాం. ఆ సమయంలో వాతావరణం బాలేక రెండు రోజులు బేస్ క్యాంప్ లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణం ఆగిపోతుందనుకునాం. కానీ నేను మాత్రం ఆశ వదులుకోలేదు. వాతావరణం మెరుగుపడడంతో శిఖరానికి చేరుకున్నాం’ అంటూ పోస్ట్ చేసింది.

జ్యోతి దేశంలోని వివిధ శిక్షణా కేంద్రాల్లో మాట్లాడింది. కానీ 40 ఏళ్ల తర్వాత అలాంటి శిక్షణ అందుబాటులో లేదని అందరూ నిరాకరించారు. దీంతో తనే సొంతంగా శిక్షణ ప్రారంభించుకుంది. ఇంట్లోనే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేది. భోపాల్ లో చిన్నట్రెక్ లకు వెళ్లడం చేసేది. ఇంట్లోనే తను జాకెట్ తయారుచేసుకుంది. 10 కిలోల బరువు ఉన్న జాకెట్ మోస్తు ఉండేది. తన పనిలో తన కుటుంబం మద్దతుగా నిలిచింది. మొదట అక్టోబర్ 2020లో భారతదేశంలోని మౌంట్ దేవ్ టిబ్బా అధిరోహించింది. దాని తర్వాత మౌంట్ ఎల్బ్రస్ను గెలువడానికి బయలుదేరింది. అలా ఆమె భోపాల్ లోని అడ్వెంచర్ గ్రూప్ లో భాగమైంది.

ఎల్బ్రస్ పర్వతాన్ని విజయవంతంగా జయించింది. కిందకి వచ్చినప్పుడు ఆమె బృందం వారు రికార్డు సృష్టించినట్లు చెప్పారు. కిలిమంజరో పర్వతాన్ని కూడా అధిరోహించడంతో.. ఇలా ఏకంగా 39 రోజుల్లో రెండు ఖండాల్లోని శిఖరాలను కైవసం చేసుకొని మరొక రికార్డు కూడా సృష్టించింది. అయితే చిన్నప్పటి నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని అనుకుంటున్నది. 2023 సంవత్సరంలో ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నది. మీరు కలలు కనగలిగితే.. దానిని కూడా నెరవేర్చుకోవచ్చునని అంటున్నది రాట్రే.