కరోనా గ్రామం.. ఒకే ఊరిలో 54 మందికి పాజిటివ్  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా గ్రామం.. ఒకే ఊరిలో 54 మందికి పాజిటివ్ 

May 29, 2020

54 Corona Cases In One Village

ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. తాజా లెక్కల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఒకే గ్రామంలో 54 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కేవలం వారం రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

 జి మామిడాడలో మే 21 వ తేదీన తొలిసారి ఓ వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. అతన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తుండగానే మరణించాడు. అతని నుంచి మొత్తం ఊరంతా వ్యాపించింది. దీంతో పాటు మరో 5 మండలాల్లో కూడా ఆ తర్వాత వైరస్ సోకడం ప్రారంభమైంది. జిల్లా మొత్తంలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క కాంటాక్ట్ నుంచి ఇన్ని కేసులు నమోదుకావడంతో వ్యాధి తీవ్రతకు అద్ధంపడుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్పమత్తమై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది.