భారత్‌లో కొత్తగా 54,366 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కొత్తగా 54,366 కరోనా కేసులు

October 23, 2020

India

భారత్‌లో తగ్గిన కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 54,366 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ సోకి 690 మంది బాధితులు మరణించారు. ఇక డిశ్చార్జిల విషయానికి వస్తే.. నిన్న ఒక్కరేజే 73,979 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

ఇప్పటివరకు 69,48,497మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,17,306 మంది బాధితులు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,95,509 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.63 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.85 శాతంగా ఉంది.