కొత్త టీవీని కొన్నామంటే వాటికి వైర్లు, స్టాండ్, వాల్ మౌంట్ ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడలాంటివేమీ లేకుండా కేవలం గోడకు అతికించేయొచ్చు. అంతేకాదు.. ఒక్క వైరు లేకుండా టీవీని ఆన్ చేయొచ్చు.
కొత్త ఎప్పుడూ వింతే అని సామెత ఊరికే అనలేదు. డిస్ ప్లేస్ టీవీ ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్ లెస్ టీవీని మన ముందుకు తీసుకొచ్చింది. 55 ఇంచులతో, 4కే స్క్రీన్ తో చాలా తక్కువ బెజెల్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ఏదైనా గోడకు, కిటికీల వంటి ఇతర ఉపరితలాలకు అతుక్కోవడానికి యాక్టివ్ లూప్ వాక్యూమ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. మొత్తం 9 కిలోల కంటే తక్కువ బరువు ఉంటుంది. కాబట్టి దానిని సులభంగా ఎత్తొచ్చు. పైగా గోడ నుంచి కింద పడకుండా ఉంటుంది.
టీవీ వైర్లెస్ భాగం కూడా విద్యుత్ సరాఫరాకు విస్తరించింది. ఇది బోర్డ్ లోని నాలుగు హాట్ స్టాపబుల్ బ్యాటరీల ద్వారా శక్తిని పొందుతుంది. రోజుకు ఆరుగంటల టీవీని చూస్తున్నట్లయితే ఈ బ్యాటరీ ఒక నెల వినియోగాన్ని అందిస్తుంది. అయితే ప్రస్తుతం రన్ టైమ్ గురించి పూర్తి వివరాలు కంపెనీ ఇంకా పంచుకోలేదు.
ఎందుకంటే వారు సీఈఎస్ 2023 కోసం కొన్ని ప్రోటో టైప్ లను మాత్రమే రూపొందించారు. కంపెనీ ఈ బ్యాటరీ మీద మరింత పని చేసే పనిలో ఉన్నారు.
పరికరం పై భాగంలో 4కే కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించనప్పుడు దాన్నిస్లాట్ లోకి నెట్టవచ్చు. అయితే కెమెరా టీవీలో సూపర్ హై రిజల్యూషన్ జూమ్ కాల్ ల కోసం మాత్రమే ఉంటుంది. మీరు చేతి సంజ్ఞలను ఉపయోగించి టీవీని కూడా యాక్టివేట్ చేయవచ్చు.
చేతి సంజ్ఞలతో మీరు వీడియో ఫీడ్ ను ఒక స్క్రీన్ నుంచి పట్టుకొని మరొక స్క్రీన్ కి మార్చుకోవచ్చు. మీరు ఈ టీవీని రిజర్వ్ చేయాలనుకుంటే మూడు వేల డాలర్లు అంటే సుమారు 2, 48, 000 రూపాయలు చెల్లించాలి. ఇప్పుడు రిజర్వ్ చేస్తే డిసెంబర్ 2023 నాటికి షిప్పింగ్ అవుతుంది. అది కూడా కంపెనీ వెబ్ సైట్ ప్రకారం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.