56.6 million dollars spent on the 95th Oscars awards ceremony 2023
mictv telugu

ఆస్కార్ వేడుకలు ఖర్చు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

March 13, 2023

ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేశారని.. ఆ డబ్బు తమకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి వాళ్ల ముఖాన కొట్టేవాళ్లమని దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై దర్శకుడు రాఘవేంద్ర, మెగా బ్రదర్ నాగబాబు స్పందించి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ కోసం నిజంగా 80 కోట్లు దాటి ఖర్చు చేశారని అని సినీ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆర్ఆర్ఆర్ విషయాన్ని పక్కనబెడితే ఆస్కార్ వేడుకలు కోసం ఖర్చు చేసిన సొమ్మును చూస్తే మాత్రం నోరు నోరెళ్లబెట్టాల్సిందే.

లాస్ ఏంజిల్స్‏ వేదికగా డాల్బీ థియేటర్‏లో ఆస్కార్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. మొత్తం 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో భారత్ రెండు ఆస్కార్‎లను దక్కించుకుంది.ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటతో పాటు, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ ’చిత్రం అస్కార్ అవార్డును గెలుచుకుంది.అయితే ఈ సారి ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ వేడుకల్లో భారీగా ఖర్చు చేశారు. ఈ వేడుకలు కోసం సుమారు రూ. 463,92,47,300 కోట్లు వెచ్చించారని సమాచారం. వీటితోపాటు ఆస్కార్ ఈవెంట్లో ఎవరైనా యాడ్ ఇవ్వాలంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో రూ.16,39,31,000 కోట్లు.

ఆస్కార్ వేడుకలు కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారి కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గెస్ట్​లకు రెడ్‌ కార్పెట్‌ మీద కాకుండా షాంపైన్ మీద ఆహ్వానం పలికారు. అంటే ఎర్ర రంగు కార్పెట్​ను షాంపైన్​ కలర్​లోకి మార్చారు. దాదాపు 50 వేల స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర. రూ. 24,700 డాలర్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ కార్పెట్​పై నడవడం కోసం ఒక్క నటి వేసుకునే డ్రెస్ ఖరీదు కనీసం 10 మిలియన్ డాలర్స్ ఖర్చు చేశారు. ఇలా ప్రతి విషయంలో వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఆస్కార్ వేడుకలను నిర్వహించారు.