మనవరాలికి జన్మనిచ్చిన నాయనమ్మ
ప్రపంచంలో అదె గర్భం సంస్కృతి పెరిగిపోతుంది.‘సరోగసి’(అద్దె గర్భం) ద్వారా పిల్లలను కనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అమెరికాలో సరోగసీ విధానంలో కొత్త కోణం వెలుగు చూసింది. మనవడికి..నాయనమ్మ జన్మనిచ్చిన ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.. 56 ఏళ్ల మహిళ తన కొడుకు-కోడలు బిడ్డను 9 నెలలు గర్భంలో మోసి జన్మనిచ్చింది.
అమెరికాలోని ఉటా ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్, కేంబ్రియా భార్యాభర్తలు. జెఫ్ హాక్ ఓ వెబ్ డెవలపర్. జెఫ్-కేంబ్రియా దంపతులకు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. వారు మరో బిడ్డకు జన్మనివ్వాలని భావించారు. అయితే కొన్ని సమస్యలు కారణంగా అప్పటికే కేంబ్రియా గర్భసంచిని వైద్యులు తొలగించారు. మరో బిడ్డను కనాలన్న ఆ దంపతులు సరోగసీ వైపు మొగ్గుచూపారు. అందుకు జెఫ్ హాక్ తల్లి నాన్సీ హాక్ ముందుకు రావడం విశేషం.
కొడుకు, కోడలు కోసం నాన్సీ తాను గర్భాన్ని మోసేందుకు అంగీకరించారు. నవమాసాలు మోసి చివరికి అమ్మాయికి జన్మనిచ్చారు.నాన్నమ్మ గుర్తుగా ఆ పాపకు హన్నా అని నామకరణం చేశారు. తన అమ్మకు జన్మించిన తన కూతురిని చూసుకోని జెఫ్ హాక్ మురిసిపోయారు. సరోగసి పుణ్యమా అని మనవరాలికి నాయినమ్మ జన్మనివ్వడం వంటి ఘటనలు సాధ్యమవుతున్నాయి.