తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

October 26, 2020

తెలంగాణ

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 582 కొత్త పాజిటివ్‌ కేసులు, నాలుగు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. అలాగే ఆదివారం రోజున 1,432 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇప్పటివరకు 2,11,912 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,31,834కి పెరిగింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో 18,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 15,582 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1311 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 91.40% శాతంగా ఉంది. రాష్ట్రంలో నిన్న 14,729 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 40,94,417 పరీక్షలు చేసారు.