5G phone at the lowest price
mictv telugu

అతి తక్కువ ధరకే 5జీ ఫోన్

November 8, 2022

తక్కవ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్ ఫోన్ కోసం చూసే వారికి లావా (LAVA) కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.9,999కే లావా బ్లేజ్ 5జీ పేరుతో కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వచ్చే ఈ ఫోన్లో, 6.51 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్‌పై పనిచేస్తుంది. అయితే ఇది కేవలం ఆరంభ ధర మాత్రమే అని కంపెనీ తెలిపింది.

ఫోటో లవర్స్ కోసం ఈ మొబైల్ లో మూడు కెమారాలు ఉన్నాయి. 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మరో రెండు సెన్సార్లను ఏర్పాటు చేసారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ప్రధాన కెమారాతో 2కే వీడియోలను రికార్డ్ చేసే సౌలభ్యం కూడా కల్పించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

ఇక దేశంలో 5జీ నెట్‌వర్క్ స్టార్ట్ కావడంతో మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులపై దృష్టిసారించాయి..యూజర్ల కోసం సరికొత్త 5జీ మొబైల్స్, ఆఫర్స్‌తో ముందుకు వస్తున్నాయి.