దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.0 నమోదు అయ్యింది. భూకంపం తర్వాత, అధికారులు ప్రకంపనలు గురించి హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం, మిండనావో ద్వీపంలోని దవావో డి ఓరో పర్వత ప్రావిన్స్‌లోని మరగుసన్ మునిసిపాలిటీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
#earthquake M 6.0 – MINDANAO, PHILIPPINES – 2023-03-07 06:02:32 UTC pic.twitter.com/cRuq9q58QH
— SSGEOS (@ssgeos) March 7, 2023
అంతకుముందు ఫిబ్రవరి 16న మస్బేట్ ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇందులో ఎలాంటి నష్టం జరగలేదు. మంగళవారం నాటి భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు ఇంకా నిర్ధారించలేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ విచారణ చేస్తున్నారు. భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫిలిప్పీన్స్ పసిఫిక్‌లోని రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉంది. ఈ ప్రదేశం చాలా సున్నితమైంది.