దేశంలో 6.3 కోట్ల మందికి వినపడటం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 6.3 కోట్ల మందికి వినపడటం లేదు

March 3, 2022

11

భారతదేశంలో వినికిడి లోపం ఉన్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే 6.3 కోట్ల మందికి పైగా ఈ లోపంతో బాధపడుతున్నారు అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ వెల్లడించింది. ”ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాలో 291 మందికి తీవ్రమైన వినికిడి లోపం ఉంది. వీళ్లలో ఎక్కువ శాతం మంది 0–14 ఏళ్లలోపు వారే. దేశంలో ఏటా 27 వేల మంది పిల్లలు చెవిటి వారిగా పుడుతున్నారు” అని తెలిపింది.

అంతేకాకుండా 2050వ సంవత్సరం నాటికి ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడతారని అంచనా వేసింది. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న డయాబెటిక్‌ బాధితుల్లో 70 శాతం మందికి గణనీయంగా వినికిడి లోపం ఉంది. శబ్ద కాలుష్యం, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల వల్ల చెవుడు, వినికిడి లోపం బాధితులు పెరుగుతున్నారు. మార్చి 3న ‘వరల్డ్‌ హియరింగ్‌ డే’సందర్భంగా వినికిడి లోపంపై కేంద్రం ఈ అంశాలను ప్రస్తావించింది.