చలికాలంలో అలోవెరా ప్రాముఖ్యతను పెంచుతుంది. తేమగా ఉండేలా చూసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఇది ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలను పొందొచ్చు.
శతాబ్దాలుగా ఔషధ మొక్కగా అలోవెరాని చూస్తున్నాం. కలబంద రసం అనేది కేవలం అందానికి మాత్రమే వాడేవాళ్లం. ఇది ఇప్పుడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు..
కలబందలో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనికి కారణం మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండడమే! యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ద్వారా మానవ శరీరాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. అంతేకాదు.. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
చర్మానికి రక్షణ..
కలబంద చర్మానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. 46 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నపురుషులు 12 వారాల పాటు రోజుకు 40ఎమ్సీజీ స్టెరాల్ చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. ఇది తీసుకోవడం వల్ల కొల్లెజాన్ ఉత్పత్తి పెరుగుతుంది. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళల్లో ముడతలు తగ్గాలంటే అలోవెరా తీసుకోవాల్సిందే!
డయాబెటిస్ కి..
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కలబంద జ్యూస్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉందని పరిశోధనల ద్వారా తేలింది. అంతేకాదు.. ప్రీ – డయాబెటిస్ ఉన్నవారు సానుకూల మార్పులను గమనించవచ్చు. మరొక అధ్యయనం ప్రకారం.. కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర, కొవ్వు ఆమ్ల స్థాయిలను మెరుగుపరుస్తుంది.
జీర్ణవ్యవస్థ..
కలబంద రసంలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇది భేదిమందు ప్రభావాలను కలిగి ఉండే మొక్కల సమ్మేళనాలు, మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతాయి. కానీ దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కచ్చితమైన ఫలితాలు పొందాలంటే కొంతకాలం ఆగాలి.
దంత ఆరోగ్యం..
కలబంద రసం దాని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా నోటి, దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మూడు నెలల పాటు ఒక ఔన్స్ కలబంద రసం ప్రతిరోజూ రెండుసార్లు నోటి సబ్ముకస్ ఫైబ్రోసిస్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది నోటిలో నొప్పి, మంటను తగ్గిస్తుంది.