6 days Imprisonment For Tea Stall Owner While Opening Stall Late Night In Hyderabad
mictv telugu

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ టీ స్టాల్ ఓపెన్.. జైలు శిక్ష విధించిన కోర్టు

October 20, 2022

నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా టీ స్టాల్‌ నిర్వహిస్తున్న వ్యక్తికి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది. అతడికి ఆరు రోజుల పాటు జైలు శిక్ష విధిచింది. కాచికూడ సీఐ రామలక్ష్మణరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ మోబిన్(36) అనే వ్యక్తి కృష్ణా నగర్‌లో టీ స్టాల్, పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మహ్మద్ తన షాపులను తెరిచి ఉంచాడు. దీంతో కాచికూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రూల్స్ బ్రేక్ చేస్తూ షాపులు తెరిచినందుకు గానూ అతడికి ఆరు రోజుల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి 8వ ఎంఎం స్పెషల్‌ కోర్టు తీర్పు వెలువరించింది.

 

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో భద్రత పెంపునకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో అర్ధరాత్రి దాటిన తర్వాత షాపులు నిర్వహించేందుకు అనుమతి లేదు. అసాంఘిక కార్యక్రమాల కట్టడికి గానూ పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహించేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.