అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిస్సిస్సిప్పీలోని టేట్ కౌంటీలో శుక్రవారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అర్కబుట్ల రోడ్డులో ఉన్న ఓ షాప్‌లోకి చొరబడిన సాయుధుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. పారిపోతున్నవారిపై, భయపడి దాక్కున్న వారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అగ్రరాజ్యంలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.ఇటీవల కాలంలో జరిగిన ఫైరింగ్‌లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజులక్రితం టెక్సాస్‌లోని సీలోవిస్టా షాపింగ్ మాల్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.పలువురు గాయపడ్డారు. నాలుగు రోజుల కిందట ఈస్ట్ లాన్సింగ్ లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపగా ముగ్గురు మరణించారు.
6 fatally shot in small Mississippi town, suspect in custody