చలికాలం రాగానే దగ్గు, జలుబు, గొంతు నొప్పులు తరుచుగా పలుకరిస్తుంటాయి. వీటివల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఇంట్లోనే ఉన్నాయి.
అవేంటో చదువండి.
చలికాలంలో చల్లని పదార్థాలు తిన్నా, తాగినా, లేకపోతే పుల్లని పదార్థాలను తీసుకున్నా కూడా గొంతు నొప్పి వస్తుంటుంది. చాలా సందర్భాల్లో గొంతు నొప్పి వైరస్ వల్ల వస్తుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియా కూడా దీనికి కారణం కావచ్చు. ఎలాంటి నొప్పినైనా నివారించాలంటే మనం కొన్ని చిట్కాలు పాటించాలి.
ఉప్పు నీళ్లు..
గొంతు నొప్పి సమస్య బాగా బాధిస్తుందా? అయితే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించవచ్చు. ఆయుర్వేదంలో వేడి నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు నియంత్రించడంతో పాటు, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
ఆపిల్ వెనిగర్..
చలికాలంలో వచ్చే గొంతు నొప్పిని వదిలించుకోవాలంటే.. 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీనివల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు, ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.
కషాయం..
ఆయుర్వేదం ప్రకారం తులసి చాలా ప్రయోజనకారిగా వర్ణిస్తారు. తులసి కషాయం తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. ఈ కషాయం తయారు చేయడానికి ఒక కప్పు నీటిలో 4 మిరియాలు, 5 తులసి ఆకులను కలిపి ఉడకబెట్టాలి. ఈ నీరు మరిగిన తర్వాత వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
పసుపు టీ..
పసుపు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. పసుపు మంటను తగ్గిస్తుంది. వాపు, సాధారణ జలుబును కూడా నయం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బయాటిక్ లక్షణాలు గొంతు నొప్పిని నివారిస్తాయి. వేడి నీటిలో పసుపు వేసుకొని తాగినా మంచి ఉపశమనం కలుగుతుంది.
తేనె..
చలికాలంలో అందరూ టీ తాగడానికి ఇష్టపడతారు. గొంతు సమస్య ఉన్నవాళ్లు టీలో చక్కెరకు బదలు తేనె కలుపుకొని చూడండి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. ఒకవేళ టీలో కాకపోయినా గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని కూడా తాగవచ్చు.
నీరు ఎక్కువగా..
ఈ కాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల కూడా సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ కారణంగా శరీరం చాలా లాలాజలాన్ని ఉత్పత్తి చేయదు. దీని కారణంగా శ్లేష్మం మీ గొంతును సహజంగా లూబ్రికేట్గాగా ఉంచుతుంది. ఇది కూడా నొప్పికి దారి తీయొచ్చు.