అందాన్ని పెంపొందించడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. కానీ 30 యేండ్ల వయసులోనే తెల్ల జుట్టు రావడం మొదలవుతుంది. తెల్ల జుట్టు సమస్య పరిష్కార మార్గాలివి..
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరసిపోతుంది. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతుంది. గ్రే హెయిర్ తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. జామకాయ హెయిర్ ప్యాక్ వేసుకోవడం మంచిది. పిడికెడు కరివేపాకును గ్రైండ్ చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల జామకాయ పొడి, వల్లర్ పాలచ్ పౌడర్ వేసి నీళ్లు పోసి కలుపాలి. దీన్ని జుట్టు మొదట్ల నుంచి రాయాలి. గంటపాటు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి.
2. ఆలుగడ్డలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఒక పాత్రలో నీరు పోసి దాంట్లో ఆలుగడ్డలను వేసి ఉడికించాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి ఉడికించిన ఆలుగడ్డను మెత్తగా చేసుకోవాలి. ఇందులో పెరుగు వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
3. కుంకుడుకాయతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నెరిసిన జుట్టు రక్షణకు ఇది బాగా పని చేస్తుంది.
4. పెరుగులో శనగపిండి వేసి కలిపి జుట్టుకు రాయాలి. అరగంట తర్వాత షాంపూ లేకుండా తలస్నానం చేయాలి. చల్లని నీటితో మాత్రమే శుభ్రం చేసుకోవాలి.
5. నాలుగు టేబుల్ స్పూన్ల టీ పొడి వేసి అందులో 6 తులసి ఆకులను వేసి మరిగించాలి. ఈ నీటితో జుట్టును కడుగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తెల్లని జుట్టు నల్లగా మారుతుంది.
6. బ్లాక్ టీ ఆకులను గోరువెచ్చని నీటిలో వేసి 2 గంటలు నానబెట్టాలి. ఆ పై దానిని మెత్తగా పేస్ట్ చేసి, కొద్దిగా నిమ్మరసం వేసి కలుపాలి. దీన్ని జుట్టుకు రాసి 40 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.