6 lakhs fine for interscast marriage in karnataka
mictv telugu

ఎప్పుడో అయిన పెళ్ళికి ఇప్పుడు శిక్ష

March 6, 2023

6 lakhs fine for interscast marriage in karnataka

ఎప్పుడో జరిగిన పెళ్ళికి ఇప్పుడు హడావుడి అంటే ఇదే. కాలం మారుతున్నారు, పరిస్థితులు మారుతున్నాయి. కానీ మనుషులు వాళ్ళ బుద్ధి మాత్రం మారడం లేదు. ఎన్ని దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మతాలు, కులాలను పట్టుకుని వేళ్ళాడుతూనే ఉన్నారు. పెళ్ళి జరిగిపోయి ఏళ్ళు గడిచినా సరే కులాంతర వివాహాలు నేరమే అంటూ ఓవరాక్షన్ చేస్తున్నారు. కర్ణాటకలో చామరాజనగర్ లో ఇద్దరు ప్రేమికులు కులాంతర వివాహం చేసుకున్నారు. వాళ్ళకు పెళ్ళయి 5 సంవత్సరాలు కూడా అయింది. అయితే ఇప్పడు ఆ విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు 6 లక్షలు జరిమానా వేశారు. వివరాల్లోకి వెళ్తే…

కర్ణాటకలో కూనగల్లి అనే గ్రామంలో గోవిందరాజు అనే వ్యక్తి శ్వేత అనే దళిత అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. తల్లిదండ్రులను ఒప్పించే వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారు. అయితే పెళ్ళి మాత్రం రిజిస్ట్రార్ ఆఫీస్ లో అయింది. దీంతో ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు. పెళ్ళియన తర్వాత గోవిందరాజు, శ్వేత మాలవల్లి అనే గ్రామంలో ఉంటున్నారు. అప్పుడప్పుడూ వచ్చి కూనగల్లి వచ్చి తల్లిదండ్రులను చూసిపోతుండేవారు. ఒకసారి అలానే వచ్చిన శ్వేత పక్కింటి వాళ్ళతో తాను ఎస్సీ కులానికి చెందిన యువతినని చెప్పింది. ఆ విషయం అలా అలా గ్రామ పెద్దల వరకూ వెళ్ళింది. దాంతో గ్రామ పంచాయితీ నిర్వహించి 3 లక్షల జరిమానా వేశారు. మార్చి 1 లోగా కట్టేయాలని కూడా చెప్పారు.

అయితే ఈ అన్యాయాన్ని భరించలేని గోవిందరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న గ్రామ పెద్దలు మా మీదే ఫిర్యాదు చేస్తావా అంటూ జరిమానాను మరో మూడు లక్షలు పెంచేశారు. దాంతో పాటు గోవిందరాజు కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు కూడా. ఊరి నుంచి రేషన్, కూరగాయలు, పాలు, నీళ్ళు ఏవీ కొనకూడదంటూ ఆర్డర్ పాస్ చేశారు. దీనికి సంబంధించి 15 మంది గ్రామస్థులు, పెద్దలు పైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.