6 more new mandals in Karimnagar district. Official announcement next month
mictv telugu

కరీంనగర్ జిల్లాలో కొత్తగా మరో 6 మండలాలు.. వచ్చే నెలలో అధికారిక ప్రకటన!

July 8, 2022

6 more new mandals in Karimnagar district. Official announcement next month

ఒకప్పుడు మొత్తం 57 మండలాలున్న సువిశాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. 2016లో జరిగిన పునర్విభజన కారణంగా నాలుగు జిల్లాలుగా ఏర్పడింది. వాటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా 9 మండలాలు, పెద్దపల్లి జిల్లా 11 మండలాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4 మండలాలు , జగిత్యాల జిల్లా 16 మండలాలు గా ఉన్నాయి. మిగతా మండలాలు సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల్లో కలిశాయి. కేవలం 16 మండలాలతో చిన్న జిల్లాగా ఆవిర్భవించిన కరీంనగర్‌ లో.. కొత్తగా మరో ఆరు మండలాలను కలిపేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

చాలాకాలంగా కొన్ని గ్రామాలను మండలాలుగా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇటీవల సర్వే కూడా ప్రారంభించింది. చల్లూరు (వీణవంక), వావిలాల (జమ్మికుంట), గర్షకుర్తి (గంగాధర), గోపాలరావుపేట (రామడుగు), రేణికుంట (తిమ్మాపూర్‌) గ్రామాలను కొత్త మండలాల కోసం గురువారం సర్వే నిర్వహించారు. గ్రామాల మ్యాప్‌లతో కొత్త మండలాల ప్రతిపాదనలను జిల్లా అధికారులకు అందజేసినట్లు తెలిసింది. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 15 నాటికి ప్రతిపాదనలకు సంబంధించిన మండలాలపై అధికారిక ప్రకటన ఉండే అవకాశముందని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ కొత్త మండలాల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది.