6 unique celebrations from around the world
mictv telugu

కొత్త సంవత్సరం ఒక్కోచోట కొత్త కొత్తగా..

December 30, 2022

6 unique celebrations from around the world

మనదేశంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి అందరూ ఎదురుచూస్తున్నారు. మనదగ్గరనే కాదు.. అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకడానికి ఎంతో ఊవిళ్లూరుతున్నారు. మరికొందరు కొత్త సంప్రదాయాలు పాటిస్తారని మీకు తెలుసా?
ప్రతి ఒక్కరికీ వారి స్వంత సంప్రదాయం ఉంటుంది. అది నూతన సంవత్సరం రోజున కూడా పాటించాలనుకుంటారు. అవి వాళ్లకి అదృష్టం తెస్తుందని నమ్ముతారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాల గురించి తెలుసుకోండి. కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. న్యూజిల్యాండ్, కెనడాలాంటి ప్రాంతాల్లో ఫైర్ వర్క్స్ తో సెలబ్రేషన్స్ జరుపుతారు.

స్పెయిన్

ఈ ప్రాంతంలో కొత్త సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇక్కడ ప్రతి ద్రాక్ష రాబోయే సంవత్సరంలో కొన్ని నెలల అదృష్టంతో ముడిపడి ఉంటుంది. మాడ్రిడ్, బార్సిలోనా వంటి కొన్ని పెద్ద నగరాల్లో ప్రజలు ప్రధాన కూడలిలో గుమిగూడి కలిసి ద్రాక్ష పండ్లను తింటారు.

డెన్మార్క్

పొరుగువారు, స్నేహితులు, కుటుంబ సభ్యుల తలుపుల వద్ద పాత ప్లేటుల, గ్లాసులను విసిరి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తారు. ఇది కొంత కొత్తగా అనిపిస్తుంది కదా! ఇక్కడ ఎన్ని విరిగిన పాత్రలు తలుపు వద్ద జమ అవుతే అంత శుభమని నమ్ముతారు. కొందరు కుర్చీల పై నిలబడి వాటి నుంచి కూడా దూకుతారు. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో శుభం కలుగుతుందని నమ్ముతారు.

బ్రెజిల్

ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు చాలా ప్రత్యేకంగా చేస్తుంటారు. కొత్త సంవత్సరంలో ప్రత్యేక లో దుస్తులు ధరించడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ సమయంలో ఎరుపు రంగు ధరిస్తారు. లో దుస్తులు కూడా ఎరుపు రంగు ఉంటే ప్రేమను, పసుపు రంగు లోదుస్తులు ధరిస్తే డబ్బు వస్తుందని అనుకుంటారు. అంతేకాదు.. ఆ రోజు పప్పు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

గ్రీస్

సంవత్సరం మొత్తం తిస్టిల్ ల ను చూడడం మామూలే! తలుపుల వెలుపల వేలాడుతున్న వాటిని ఈ రోజు కచ్చితంగా చూసి తీరాల్సిందే! అలాగే ఉల్లిపాయలను నాటి వాటి మూలల పెరుగుదలను బట్టి సంవత్సరం కూడా తమ భవిష్యత్తు పెరుగుందని నమ్మకం.

టర్కీ

రాత్రి 12 అవ్వగానే ఒకరికొకరు విష్ చేసుకుంటారు. కానీ టర్కీలోని కొన్ని ప్రాంతాల్లో తలుపుల మీద ఉప్పు చల్లుతారు. ఈ ఉప్పు వారికి ఏడాది పొడవునా శ్రేయస్సు, శాంతిని కలిగిస్తుందని నమ్ముతారు.

కొలంబియా

ఇక్కడ జరిగే సంప్రదాయాన్ని అగ్యురో అంటారు. దీని ప్రకారం.. ప్రతి సభ్యుడు మంచం కింద మూడు ఆలుగడ్డలను ఉంచాలి. అందులో కూడా ఒక ఆలుగడ్డను పొట్టు తీయకుండా, మరొకటి సగం పొట్టు తీసి, మూడవది.. పూర్తిగా పొట్టు తీసేసి పెట్టాలి. ఆ తర్వాత ఒక్కో వ్యక్తి వచ్చి కళ్లు మూసుకొని ఆలుగడ్డను సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఏ ఆలుగడ్డను సెలెక్ట్ చేసుకుంటారో వారి భవిష్యత్తు ఉండబోతుందో తెలుసుకుంటారు.