అత్యాచార నిందితుడికి కరోనా.. 60 మంది పోలీసులు క్వారంటైన్‌లోకి - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచార నిందితుడికి కరోనా.. 60 మంది పోలీసులు క్వారంటైన్‌లోకి

July 6, 2020

60 Cops

పాపాత్మున్ని పట్టుకున్నా పాపం చుట్టుకున్నట్టే ఉంది ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో. అత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని పట్టకోవడానికి రంగంలోకి దిగిన 60 మంది పోలీసులు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మైసూర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడిని బిలాస్ పూర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీసులు జులై 4న అరెస్ట్ చేశారు. గత నెలలో ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(మైసూరు యూనిట్)లో నిందితుడు పని చేస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేశాక జైలుకు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సివిల్ లైన్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 60 మంది పోలీసులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కాగా, పోలీసులు అందరి రక్త నమూనాలను వైద్యులు సేకరించారు. త్వరలో వారి ఫలితాలు రానున్నాయి. మరోవైపు అత్యాచారానికి గురైన మహిళకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.