సాహోరే.. 60 అడుగుల ప్రభాస్ కటౌట్
Editor | 18 Aug 2019 4:15 AM GMT
సాహో ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ 60 అడుగుల కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది. రామోజీఫిల్మ్ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది. 60 అడుగుల ప్రభాస్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ‘సాహో’ సినిమాలోని ప్రభాస్ స్టిల్‌ను కటౌట్‌గా చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. శ్రద్దాకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.
Updated : 18 Aug 2019 4:15 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire