హైదరాబాద్‌లో టీడీపీ నేత కారు నుంచి 60 లక్షలు స్వాధీనం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో టీడీపీ నేత కారు నుంచి 60 లక్షలు స్వాధీనం

October 18, 2018

తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. హైదరాబాద్‌లో గురువారం భారీ మొత్తంలో హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీకి చెందిన తెలుగు యువత ఉపాధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ కారు డ్రైవర్‌ మహేశ్‌ వద్ద నుంచి ఈ మొత్తాన్ని పట్టుకున్నట్లు తెలిపారు.

5tyt

డబ్బును జగిత్యాలకు తీసుకెళ్తుండగా మహేశ్‌తోపాటు మరో ఐదుగురిని సెంట్రల్‌ జోన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్లభనేని అనిల్‌ ఆదేశాలపైనే సొమ్మును తరలిస్తున్నట్టు మహేశ్‌ పోలీసుల విచారణలో అంగీకరించాడు. లెక్కాపత్రాల్లేకపోవడంతో ఇది హవాలా సొమ్ము అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతడబ్బును ఎన్నికల్లో పంచడానికేనా లేకపోతే ఎవరికైనా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.