ట్రక్కులో 64 శవాలు… వాటి మధ్య 14 మంది సజీవంగా..  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రక్కులో 64 శవాలు… వాటి మధ్య 14 మంది సజీవంగా.. 

March 26, 2020

64 Suspected Migrants from Ethiopia Found Dead in Container in Mozambique

పొట్ట పోసుకోవడానికి వలస వెళ్లిన కూలీల ఉసురు తీసుకున్నాడు ఓ ట్రక్కు డ్రైవర్. మొజాంబిక్‌లోని  టేటే రాష్ట్రంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద ట్రక్కులో 64 మృత దేహాలు బయటపడ్డాయి. వాటి మధ్య 14 మంది సజీవంగా ఉండటం కలకలం రేపింది.  పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు రాష్ట్ర సరిహద్దుల్లో మలావీ నుంచి వస్తున్న ఈ వాహనాన్నిఆపి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. మృతులను  జింబాబ్వే నుంచి వచ్చిన ఇథియోపియన్లుగా భావిస్తున్నారు. వాహనంలో వారిని కుక్కడంతో శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పోలీసులు కంటెయినర్ డ్రైవర్‌ను, అతని అసిస్టెంట్‌ను అరెస్ట్ చేశారు. కొనఊపిరితో ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించారు.

మొజాంబిక్‌కి ఇథియోపియన్ల అక్రమ వలసలు సాధారణమే. ఉపాధికోసం అనేకమంది ఇథియోపియన్లు దొంగచాటుగా చొరబడుతుంటారు. ఇదే అదనుగా భావించిన దళారులు పెద్ద మొత్తంలో డబ్బులు గుంజి అక్రమంగా తరలిస్తుంటారు.