65-year-old man was often committing unnatural acts with a dog, police arrested
mictv telugu

కుక్కకు ఆహారం పెట్టడానికి ఇంట్లోకి పిలిచి..

August 28, 2022

దేశంలో వయస్సు, వరుస అనే తేడా లేకుండా తరచూ మహిళలపై కామాంధులు చేస్తున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా.. ఎక్కడబడితే అక్కడ ఈ తరహాలో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు కామాంధులు జంతువులపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు. కళ్లు మూసుకుపోతే మానవ మృగాలు జంతువులనైనా వదలిపెట్టరని మరోసారి రుజువైంది. ఇంతకు ముందు కుక్కలు, ఆవులు, ఇతర జంతువులపై మానవ మృగాలు అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి తన ఇంటి సమీపంలో కుక్కపై అత్యాచారాని పాల్పడ్డాడు. కుక్కతో తరచూ అసహజ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు జంతు సంరక్షకులు. కుక్కకు ఆహారం పెట్టడానికి ఇంట్లోకి పిలిచి ఈ దుశ్చర్య చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులకు అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.