తెలంగాణలో కొత్తగా 66 కరోనా కేసులు..ముగ్గురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 66 కరోనా కేసులు..ముగ్గురు మృతి

May 25, 2020

Telangana

తెలంగాణలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు మరో 66 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈరోజు ముగ్గురు కరోనా బారిన పడి మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1920కి చేరింది. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈరోజు 31 కేసులు నమోదవగా.. మరో 15 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే విదేశాలనుంచి వచ్చిన 18 మందికి కరోనా పాజిటివ్ తేలింది. రంగారెడ్డి జిల్లాలో ఒకరికి, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈరోజు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 72 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1164కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 56 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.