67 ఏళ్ల వయసులో బిడ్డ, సహజ గర్భమే.. పెద్దకూతురు గుస్సా.. - MicTv.in - Telugu News
mictv telugu

67 ఏళ్ల వయసులో బిడ్డ, సహజ గర్భమే.. పెద్దకూతురు గుస్సా..

October 28, 2019

బామ్మలు తల్లలైపోతున్నారు. 60, 70 ఏళ్ల ముదిమిలో గర్భాలు ధరించి సందడి చేస్తున్నారు. మొన్న తూర్పుగోదావరి 75 ఏళ్ల ఎర్రమట్టి మంగాయమ్మ, నిన్న 74 ఏళ్ల రాజస్తాన్ ప్రభాదేవి తల్లులైన సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో ఓ బామ్మ 67 ఏళ్ల వయసులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంగాయమ్మ, ప్రభాదేవి కృత్రిమ గర్భధారణలో తల్లులు కాడా, టియాన్ అనే ఈ చైనా బామ్మ సహజంగానే గర్భం దాల్చింది. బిడ్డను కనడానికి 40 ఏళ్లున్న కూతురితో పెద్ద పోరాటమే చేసింది.

67-year-old.

షాండాండ్ రాష్ట్రానికి చెందిన టియాన్ రిటైర్డ్ డాక్టర్. ఆమెకు ఇదివరకే ఇద్దరు సంతానం ఉన్నారు. భర్తకు 68 ఏళ్లు. వారి దాంపత్యానికి చిహ్నంగా టియన్ గర్భం దాల్చింది. అయితే అది సరికాదని, అబార్షన్ చేయించుకోవాలని కూతురు పట్టుబడింది. బిడ్డను కంటే కుటుంబం పరువుపోతుందని, తాను తెగతెంపులు చేసుకుంటానని హెచ్చరించింది. అయినా టియాన్ వెనక్కి తగ్గకుండా బిడ్డను కనేసి చైనా అత్యంత ఎక్కువ వయసులో తల్లి అయిన మహిళగా రికార్డులకెక్కింది. చైనాలో ఒకేబిడ్డ విధానాన్ని సడలించాక పలువురు వృద్ధులు మళ్లీ సంతానం కోరుకుంటున్నారు. కృత్రిమ గర్భధారణతో పిల్లలకు జన్మనిస్తున్నారు.