ఒక్కరోజే 6767 కొత్త కేసులు, 147 మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కరోజే 6767 కొత్త కేసులు, 147 మరణాలు

May 24, 2020

cbnfgcb

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. రోజురోజుకీ కేసుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. గత మూడురోజులుగా సగటున 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

ఇదిలా ఉంటే గడచిన 24గంటల్లో అత్యధికంగా 6767పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,31,868కి చేరింది. వీరిలో నిన్న ఒక్కరోజే 147మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు 3867 మంది కరోనా మరణించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు 54,441మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం 73,560మంది ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.