ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 76,416 నమూనాలను పరీక్షించగా.. 6,923 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,674కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 45 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాకు బలైనవారి సంఖ్య 5,708కి చేరింది.
చనిపోయినవారిలో ప్రకాశం జిల్లాలో 8 మంది మృతిచెందగా.. కృష్ణా 6, గుంటూరు 5, తూర్పు గోదావరి 4, పశ్చిమ గోదావరి 4, అనంతపురం 3, కడప 3, కర్నూలు 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, చిత్తూరు 2, విజయనగరం జిల్లాలో 1గా మృత్యువాత పడ్డారు. మరోవైపు 24 గంటల వ్యవధిలో 7,796 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56,00,202 నమూనాలను పరీక్షించారు.