తాగింది మంచినీళ్ళే.. టిప్పు మాత్రం రూ. 7.38 లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

తాగింది మంచినీళ్ళే.. టిప్పు మాత్రం రూ. 7.38 లక్షలు

October 23, 2018

హోటల్‌కు వెళ్ళినప్పుడు కష్టమర్లను ఆకర్షించడానికి సర్వర్లు చాలా వినమ్రంగా ప్రవర్తిస్తుంటారు. కష్టమర్ అడిగింది చటుక్కున అందిస్తారు. నవ్వుతూ మాట్లాడతారు. కష్టమర్ అస్సలు ఇబ్బంది పడకుండా చాలా గౌరవంగా చూసుకుంటారు. దీంతో సదరు కష్టమర్ వెళ్ళేటప్పుడు సర్వర్‌కు టిప్ ఇచ్చి వెళతాడు. ఆ టిప్ ఎక్కువ అవ్వొచ్చు… తక్కువ అవ్వొచ్చు. అలాంటిదే ఈ ఘటన. ఓ కష్టమర్ ఓ హోటల్‌కు వెళ్ళి మహిళా సర్వర్‌కు ఊహించనంత టిప్ ఇచ్చి ఆమెను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు.

హోటల్‌కు వచ్చి కేవలం మంచినీరు తాగి వెళ్లిన అతను, తనకు నీళ్లిచ్చిన యువతికి ఏకంగా 10 వేల డాలర్లు (సుమారు రూ. 7.38 లక్షలు) టిప్ ఇచ్చాడు. ఈ ఘటన నార్త్ కరోలినాలో జరిగింది. Drinking water .. Rs. He gave 7.38 lakh tipవివరాల్లోకి వెళ్తే… నార్త్ కరోలినాలోని ఓ హోటల్‌లో అలియానా కస్టర్ అనే యువతి వెయిట్రెస్‌గా పనిచేస్తోంది. నెలకింత జీతం, వచ్చిన కష్టమర్లు ఇచ్చే టిప్పులపై ఆమె జీవితం అలా అలా సాగిపోతోంది. సాధారణ జీవితం గడుపుతున్న ఆమె పెద్దమొత్తంలో డబ్బు చూడటం అనేది కలే. కానీ ఓ కష్టమర్ ఆమెపట్ల దేవుడిలా వచ్చి టిప్ రూపంలో ఆమె ఊహించనంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. హోటల్‌కు వచ్చిన అతను కేవలం మంచినీళ్ళు కావాలని అడిగాడు. వెంటనే అలియానా నీళ్ళు తెచ్చి ఇచ్చింది. అవి తాగాక మరో గ్లాసు మంచినీళ్ళు అడిగాడు.

అలియానా అంతే వినమ్రంగా వెళ్ళి మళ్ళీ తెచ్చి ఇచ్చింది. కష్టమర్ నీళ్ళు తాగి వెళ్తే ఏం గిరాకీ కాదని తెలిసి కూడా ఆమె అతనికి మంచినీళ్ళు ఇచ్చింది.

దీంతో అతను ఆమె వినమ్రతకు, కష్టమర్‌ను రిసీవ్ చేసుకున్న విధానానికి ఫిదా అయ్యాడు. పైగా ఆమె ఇచ్చిన మంచినీరు అమృతంలా వున్నాయని మరింత మెచ్చుకుంటూ మోచేయి విదిల్చాడు. ‘రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు’ అని ఓ కాగితంపై రాసి, టిప్‌ను అక్కడ పెట్టి వెళ్లాడు. అంత పెద్ద మొత్తాన్ని చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. ఇంతలో అతను మరోసారి వచ్చి, ఆమెకు ఓ హగ్ ఇచ్చి వెళ్లాడు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

తర్వాత అతనో యూట్యూబ్ స్టార్ మిస్టర్ బీస్ట్ అని తెలుసుకున్న ఆమె నమ్మలేకపోయింది. సెలెబ్రిటీల్లో ఇంతమంచి దానగుణం వుంటుందా అనుకుంది.

ఈ రోజును తన జీవితంలో మరచిపోలేనని చెబుతోంది. తనతో పాటు పనిచేస్తూ, చదువుకునే  బీదవారికి సాయం చేసేందుకు డబ్బును వినియోగిస్తానంది.