రష్యాలో భారీ భూకంపం..సునామి హెచ్చరికలు జారీ - MicTv.in - Telugu News
mictv telugu

రష్యాలో భారీ భూకంపం..సునామి హెచ్చరికలు జారీ

March 25, 2020

Russia

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెల్సిందే. కరోనా దెబ్బకి ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. వందల కోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ అయిన దేశాల్లో రష్యా కూడా ఒకటి. అయితే ఇప్పటీకే కరోనాతో సతమతం అవుతోన్న రష్యాలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది.

రష్యా దేశంలోని కురీల్ దీవుల్లో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.5 గా ఉందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. రష్యన్ పట్టణానికి 219 కిలోమీటర్ల దూరంలోని కురీల్ దీవుల్లో సంభవించిన భూకంపం 56.7 కిలోమీటర్ల లోతులో వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎంత ఆస్తినష్టం జరిగిందనేది ఇంకా అంచనా వేయలేదు. అయితే దీవుల్లో భూకంపం రావడంతో రష్యా ప్రభుత్వం సునామి హెచ్చరికలను జారీ చేసింది.