7 Animals And Birds Known To Have Disappeared For Decades But Were Found In 2022
mictv telugu

వందల సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సంవత్సరంలో కనిపించాయి!

December 23, 2022

7 Animals And Birds Known To Have Disappeared For Decades But Were Found In 2022

చనిపోయిన వారు తిరిగి వచ్చినట్లు ఎప్పుడైనా విన్నారా? లేదు కదా! కానీ శతాబ్దాల తర్వాత కనుమరుగయ్యాయి అనుకున్న జంతువులు, పక్షులు ఈ సంవత్సరంలో కనిపించాయి. వాటి జాబితా ఇది..
జంతువులు.. పక్షి జాతులు ఎన్నో ఉన్నాయి. కానీ కొంతకాలానికి కొన్ని రకాలు కనిపించకుండా పోతాయి. కొత్తవి పుట్టుకొస్తాయి. వందల, వేల సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన కొన్నిరకాల జంతువులు, పక్షులు ఈ సంవత్సరంలో కనిపించాయి. ఈ సంవత్సరం పూర్తి కావస్తుంది కాబట్టి వాటి గురించి ఈ ప్రత్యేక కథనం..

నీలి సీతాకోకచిలుక..

జనవరి 2022లో మధ్యప్రదేశ్ లోని ఇద్దరు కీటక శాస్త్రజ్ఞులు గ్లాకోప్సుచే ఎక్సరేసిస్ సీతాకోకచిలుకను గుర్తించారు. సుమారు 80 సంవత్సరాల క్రితం అంటే 1941లో అంతరించిందనుకున్న సీతాకోకచిలుక కనిపించింది. గవర్నమెంట్ ఎమ్ హెచ్ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ శాస్త్రజ్ఞులు అయిన శ్రద్ధా ఖప్రే, డాక్టర్ అర్జున్ శుక్లా బార్గి డ్యామ్ సమీపంలో ఈ సీతాకోక చిలుకను చూశారు. దీన్ని జాగ్రత్తగా సేకరించి భద్రపరిచారు. ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో భద్రపరిచిన సీతాకోక చిలుక నమూనాల చిత్రాలతో పోల్చారు.

నోంబే నోంబే కంగారు..

42వేల సంవత్సరాల క్రితం అంతరించింది అనుకున్న కంగారూ జూలై 2022లో కనిపించింది. ఇది పాపువా న్యూ గినియా పర్వాతలలో పెద్ద శిలాజాన్ని పాలియోంటాలజిస్టులు కనుగొన్నారు. బూడిద, ఎరుపు కంగారూల్లో ఇది చివరి జాతి. ప్రస్తుతం ఉన్న కంగారూలకు దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఈ కంగారూలు కేవలం పాపువా న్యూ గినియాలో మాత్రమే కనిపించే అత్యంత ప్రాచీన కంగారూ జాతి. పాలియోంటాలాజికల్ సైట్ అయిన నోంబే రాక్ షెల్టర్ కనుగొన్న ప్రదేశం కాబట్టి దీనికి కొత్తగా ‘నోంబే నోంబే’ అని పేరు పెట్టారు.

కొత్త పావురం..

లైవ్ సైన్స్ ప్రకారం.. 140 సంవత్సరాల తర్వాత పరిశోధకులు నల్లని రంగులో మెరిసిపోయే నెమలి -పావురం జాతికి చెందిన అరుదైన పక్షిని కనుగొన్నారు. ఇది కూడా పాపువా న్యూ గినియాలోని ఫెర్గూసన్ ద్వీపంలోని నిటారుగా ఉన్న అటవీ వాలులకు చెందినది. ఒక శతాబ్దానికి పైగా ఈ జాతి తప్పిపోయిందని అక్కడి స్థానికులు, యూఎస్ పరిశోధకుల బృందం అంటున్నారు. ఈ పక్షి జాతి పేరు.. ‘ఔవో’. కోవిడ్ కారణంగా ఈ పక్షిని కనుగోవడం కాస్త ఆలస్యం అయిందంటున్నారు పరిశోధకులు. సెప్టెంబర్ 2022లో వీరి కంటికి ఈ పక్షి కనిపించింది.

గోల్డెన్ స్నేక్..

పాములు పలు విధాలు అంటారు. ఎన్నో రకాల పాములు మన భూమ్మీద ఉన్నాయి. అయితే 142 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన గోల్డెన్ షీల్డ్ టైల్ అక్టోబర్ 2022లో కనిపించింది. కేరళలోని వాయనాడ్ రాష్ట్ర అటవీ శాఖ సహాయంతో ఈ అరుదైన పామును తిరిగి కనుగొన్నారు. ఈ జాతి మొదట 1880లో కల్నల్ రిచర్డ్ హెన్రీ బెడ్ డోమ్ కనుగొన్నారు. ఈ పాము శరీరం ఆలివ్ పసుపు రంగుల మిశ్రమంగా ఉంటుంది. పొత్తికడుపుపై మాత్రం ప్రకాశవంతమైన పసుపు, నలుపు రంగులను చూడొచ్చు.

నల్లని కప్ప..

దక్షిణ అమెరికా అంతటా బెజ్వెల్డ్ కప్పల సమూహం తిరిగొస్తుంది. హార్లెక్విన్ కప్పలు వందకంటే ఎక్కువ ముదురు రంగు జాతులు కలిగిన జాతి. 1980లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన చర్మాన్ని తినే చైట్రిడ్ ఫంగస్ తో తీవ్రంగా దెబ్బతిన్న ఉభయచరాల సమూహాలలో ఇది ఒకటి. హార్లెక్విన్ కప్ప దాదాపు 70శాతం అంతరించిపోయిందని అనుకున్నారు. కొన్నేళ్లుగా ఈ కప్పల కోసం శోధించారు. ఎవరైనా వీటిని కనుగొంటే బహుమతులు అందిస్తామని ప్రకటించారు. దీని సాధారణ పేరు ‘జంపతు’ అనే పదం నుంచి వచ్చింది. కిచ్వాలో ఈ పదానికి అర్థం కప్ప. దీన్ని మళ్లీ నవంబర్ 2022లో కనుగొన్నారు.

అరుదైన పక్షి..

40 సంవత్సరాల క్రితం అంతరించిపోతున్న పక్షి వాయువ్య విక్టోరియన్ అరణ్యంలో కనుగొనబడింది. లాట్రోబ్ యూనివర్సిటీ పరిశోధకులు నవంబర్ లో నిహిల్ సమీపంలోని మల్లీస్ బిగ్ డెసర్ట్ వైల్డర్ నెస్ పార్క్ లో తెల్లటి ఈ పక్షిని కనుగొన్నారు. బెండిగోకు చెందిన వికలాంగుల సహాయ కార్యకర్త వైల్డ్ ఈ పక్షి కదలికలను రికార్డ్ చేశాడు. ఈ తెల్లని పక్షి ఎక్కువగా ముదురు ఆలివ్ గోధుమ రంగుల కాంబినేషన్ లో ఉంటుంది. ఇది తక్కువ ఆకులు ఉన్న చెట్టు పై లేదా నేల పై ఉంటుంది.

తెల్లని బివాల్వ్..

సైమాటియోయా కుకీ అని పిలిచే ఒక అరుదైన జాతిని 40వేల సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. ఆ తర్వాత 2018లో కాలిఫోర్నియా తీరంలో సముద్రపు స్లగ్ ల కోసం టైడ్ పూల్స్ ను వెతుకుతున్నప్పుడు మెరైన్ ఎకాలజిస్ట్ జెఫ్ గొడ్డార్డ్ ఏదో కొత్త జీవిని కనుగొన్నాడు. కానీ అది ఆయన చేతిలో నుంచి జారిపోయింది. మళ్లీ నవంబర్ 2022లో కనుగొనబడింది. ఈ బివాల్వ్ మొదటిసారి 1930లో చూశారు. ఇంతకాలం ఎలా తప్పించుకుందా అని పరిశోధకులు అనుకుంటున్నారు.