7 countries that offer affordable education for Indian students in 2023
mictv telugu

అతి తక్కువలో విద్యార్థులకు ఉన్నత విద్యనందిస్తున్న యూనివర్సిటీలు!

January 24, 2023

7 countries that offer affordable education for Indian students in 2023

అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాల విషయానికి వస్తే భారతీయ విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు, ఇనిస్టిట్యూట్ లో ప్రవేశం పొందడానికి గట్టి పోటీని ఎదుర్కుంటున్నారు. అయితే తక్కువలో ఈ విదేశీ యూనివర్సిటీలు భారతీయులకు స్వాగతం పలుకుతున్నాయి. విదేశాలకు వెళ్లి చదువాలని చాలామంది ఆశపడుతారు. కానీ లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉందని వెనుకడగువేస్తారు. కానీ తక్కువ ఖర్చులోనే కొన్ని యూనివర్సిటీలు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఈ సంవత్సరం మొదలైంది. ఇప్పుడు ఏఏ యూనివర్సిటీలు తక్కువ ఖర్చుతో ప్రవేశాన్ని ఇస్తున్నాయో చదువండి.

జర్మనీ
అంతర్జాతీయ విద్యార్థులకు ఉచిత విద్యను అందించే విషయంలో జర్మనీ అగ్రస్థానంలో ఉంది. విశ్వవిద్యాలయాలు ఆంగ్లంలో ఉచితంగా కోర్సులను అందిస్తాయి. ట్యూషన్ ఫీజులు కూడా ఉండవు. ప్రపంచ ర్యాంకింగ్స్ లో మంచి రేటింగ్ కలిగి ఉన్నాయి. సరసమైన, అధిక నాణ్యత గల విద్యను కోరుకునే వారు ఈ దేశంలోని విశ్వవిద్యాలయాల కోసం అడ్మిషన్ తీసుకోవచ్చు.

స్పెయిన్
భారతీయ విద్యార్థులు స్పానిష్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్య కోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. స్పెయిన్ లోని జీవన వ్యయాలు చాలా తక్కువ. విద్య కూడా బాగుంటుంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ట్యూషన్ ఫీజు కోసం దాదాపు 1000 యూరో (85000 రూపాయాలు) వసూలు చేస్తాయి.

ఆస్ట్రియా
భారతీయ విద్యార్థులు ట్యూషన్ ఫీజులో ఒక్కో సెమిస్టర్ కు దాదాపు 730 యూరో (సుమారు రూ. 62,000) చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రియా ఉన్నత స్థాయి విద్యను అందిస్తుంది. అలాగే అక్కడ జీవన ప్రమాణాలకు అయ్యే ఖర్చు కూడా తక్కువే ఉంటుంది.

ఫ్రాన్స్
ఫ్రాన్స్ అనేక విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్యను అందిస్తున్నది. ఇక్కడ అతి తక్కువ ట్యూషన్ ఫీజులను వసూలు చేస్తారు. కెరీర్ అవకాశాలతో పాటు, అద్భుతమైన జీవన నాణ్యతను పొందొచ్చు. అధిక అంతర్జాతీయ విద్యార్థులతో ఫ్రాన్స్ టాప్ లో ఉంటుంది.

బెల్జియం
నామ మాత్రపు ట్యూషన్ ఫీజుతో అధిక నాణ్యత విద్యను పొందాలనుకుంటున్నారా? అయితే బెల్జియం బయలుదేరండి. యూరోపియన్ దేశంలో చదువే కాదు.. వృత్తిపరమైన వృద్ధికి అద్భుతమైన స్కోప్ ఉంటుంది. మంచి వాతావరణంలో హాయిగా చదువుకోవచ్చు.

ఇటలీ
ఇటలీ విద్యార్థులకు ఆసక్తికరమైన కోర్సు ఎంపికలను అందించగలిగేది ఇక్కడే. అద్భుతమైన పరిశోధనా సౌకర్యాలు, అగ్రశ్రేణి అధ్యాపకులు, ఆధునిక పాఠ్యాంశాలను ఇక్కడి విశ్వవిద్యాలయాలు అందిస్తాయి. వారు సంవత్సరానికి దాదాపు 1800 యూరో (1,54,000 రూపాయలు) ట్యూషన్ ఫీజు చెల్లించాలి.

గ్రీస్
ప్రాచీన సంస్కృతి, అభ్యాసానికి సంబంధించిన సీట్లలో ఒక్కటైన గ్రీస్ అంతర్జాతీయ విద్యార్థులకు దాదాపు ఉచిత విద్యను అందిస్తుంది. ఇక్కడ జీవన వ్యయం తక్కువే. అలాగే జీవన నాణ్యత కూడా అద్భుతంగా ఉంటుంది. అందమైన నగరంలో అద్భుతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.