అంబులెన్సులు కూడా చంపేస్తున్నాయ్... ఏడుగురు బలి - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్సులు కూడా చంపేస్తున్నాయ్… ఏడుగురు బలి

May 31, 2022

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్ మినహా మిగతా ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. బాధితుల్లో ఒకరు ఢిల్లీలోని రామమూర్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బరేలీ జిల్లాకు వెళ్తున్న క్రమంలో ఢిల్లీ-లక్నో హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. అంబులెన్స్ మొదట డివైడర్‌ను ఢీకొట్టి.. ఆపై ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని… మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాద ఘటనపై ఫతేగంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.